: మనవడితో కలిసి బోటు షికారు చేసిన చంద్రబాబు!
నిత్యం బిజీగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ తో కలిసి సరదాగా కాసేపు బోటు షికారు చేశారు. తన నివాసం నుంచి ఇబ్రహీంపట్నం వరకు కృష్ణానదిలో పర్యాటక బోటులో ఈరోజు సాయంత్రం వీరు విహరించారు. కాగా, విజయవాడలో రెండు రోజుల క్రితం నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో ఒకే వేదికపై సీఎం చంద్రబాబుతో పాటు తనయుడు లోకేశ్, మనవడు దేవాన్ష్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం విదితమే.