: ముడుపుల కేసులో స్వతంత్ర విచారణకు మోదీ ఎందుకు సిద్ధంగా లేరు?: షీలా దీక్షిత్
'సహరా-బిర్లా' ముడుపుల విషయంలో కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో పలువురి పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరు కూడా కనిపించింది. దీనిపై ఈ రోజు మీడియా ఆమెను ప్రశ్నించడంతో ఆ పత్రాల ప్రామాణికతను ఆమె కొట్టిపారేసినట్లు మాట్లాడారు. ఓ వైపు ఈ పత్రాల ఆధారంగానే రాహుల్ గాంధీ మోదీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై షీలా దీక్షిత్ మాట్లాడుతూ... ఆ పత్రాల్లో ప్రామాణికత లేదని వ్యాఖ్యానించడంతో పాటు ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో స్వతంత్ర విచారణకు మోదీ ఎందుకు సిద్ధంగా లేరని ఆమె ప్రశ్నించారు.