: ఇంత నీచమైన రాజకీయాలను నా జీవితంలో చూడలేదు: చంద్రబాబు


ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయాలను ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేతలు ఎన్నో కుట్రలు పన్నారని, అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. పట్టిసీమను అడ్డుకోవడానికి ఎన్నో ఎత్తులు వేసి, విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. రైతులను రెచ్చగొట్టడం, కోర్టుల్లో కేసులు వేయడంలాంటి పనులు చేశారని తెలిపారు. అయినా, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుకు నిధులను మంజూరు చేయించుకున్నామని... నిర్దేశిత సమయంలోగా పోలవరంను పూర్తి చేసి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. పోలవరంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఏపీకి దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు తెలిపారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని చెప్పారు. దుర్మార్గులకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 

  • Loading...

More Telugu News