: కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్... పరిశ్రమలను రింగ్ రోడ్డు అవతలకు తరలిస్తాం: కేటీఆర్
హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛమైన నగరంగా, కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాదులో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను తరలిస్తామని చెప్పారు. క్లస్టర్లవారీగా పరిశ్రమలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 1160 పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ పరిశ్రమలను తరలించేందుకు 19 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. పరిశ్రమలను తరలించే ప్రాంతాల్లో కూడా కాలుష్యం తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.