: తెలంగాణ శాసనసభ నుంచి టీడీపీ, కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ శాసనసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు కూడా ముగ్గురు ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై చర్చను చేపట్టాలంటూ వీరు ముగ్గురూ పట్టుబట్టారు. అంతేకాదు, పోడియం వద్దకు దూసుకువచ్చి ఆందోళనకు దిగారు. దీంతో, సభాకార్యక్రమాలకు అడ్డుతగులుతున్న వీరి ముగ్గుర్నీ సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ మంత్రి హరీష్ రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో, వీరి ముగ్గుర్నీ ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.