: గోవా ఎయిర్ పోర్టులో జెట్ ఎయిర్ వేస్ విమానానికి ప్రమాదం... పది మందికి గాయాలు


గోవా ఎయిర్ పోర్టులో విమానప్రమాదం చోటుచేసుకుంది. గోవాలోని డబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గోవా నుంచి ముంబై బయల్దేరుతున్న జెట్ ఎయిర్ వేస్ విమానం టేకాఫ్ సమయంలో రన్ వే పై నుంచి జారిపోయింది. ఈ సమయంలో విమానంలో 154 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. దీంతో విమానం ఒక్కసారిగా భారీ కుదుపుకు లోనైంది. ఈ క్రమంలో విమానం ఆగడంతో ప్రయాణికులు దిగిపోయిందుకు పరుగులు తీశారు. దీంతో  విమానంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో పది మంది గాయపడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది, హుటాహుటీన ఎమర్జెన్సీ ద్వారాలు తెరిచి ప్రయాణికులను దించేశారు. నేటి మధ్యాహ్నం వరకు ఎయిర్ పోర్టును మూసేశారు. కాగా, రన్ వేపై విమానం జారిపోవడానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News