modi: అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం కావడం భారతీయులకు గర్వ కారణం: ప్రధాని మోదీ
డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అగ్ని-5 క్షిపణిని శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని విజయాలను మనం సాధించాలని అన్నారు. అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం కావడం భారతీయులకు గర్వకారణమని, మన రక్షణ రంగానికి ఇది మరింత శక్తిని చేకూర్చుతుందని చెప్పారు.
Successful test firing of Agni V makes every Indian very proud. It will add tremendous strength to our strategic defence.
— Narendra Modi (@narendramodi) December 26, 2016