: వచ్చే ఏడాది చంద్రబాబు పదవికి ఎటువంటి గండం లేదు: జ్యోతిష్కుడు శ్రీనివాస గార్గేయ


వచ్చే ఏడాది చంద్రబాబు పదవికి ఎటువంటి గండం లేదని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కూడా ఉంటారని ప్రముఖ జ్యోతిష్కుడు శ్రీనివాస గార్గేయ అన్నారు. జనవరి 27న మౌని అమావాస్య సందర్భంగా ప్రజలందరూ మౌనం పాటించాలని చెప్పారు.  ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, అయినప్పటికీ, ఆ ప్రభావం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండదన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నా, పరిపాలనకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు ఉండవని, పెద్దనోట్ల రద్దు సమస్యలు 2018 వరకూ ఉంటాయని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News