: గాడ్ ఫాదర్ ఎవరూ లేరు.. హార్డ్ వర్క్ వల్లే సక్సెస్ సాధించాను: సప్తగిరి


సినిమా ఇండస్ట్రీలో తనకు ఎవరూ గాడ్ ఫాదర్  లేరని, కేవలం హార్డ్ వర్క్ వల్లే సక్సెస్ సాధించానని ప్రముఖ కమెడియన్ సప్తగిరి అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, చాలా మంది దర్శకులు, నిర్మాతలు, తనకు మంచి పాత్రలు, మంచి పారితోషికం ఇచ్చారని అన్నాడు. ‘ఆర్టిస్టుని అవుతానని కలలో కూడా అనుకోలేదు. పైగా, కమెడియన్ ని కావడం ఒక స్వీట్ యాక్సిడెంట్. కమెడియన్ గా సక్సెస్ అయ్యాను. చేతిలో చిత్రాలు ఉన్నాయి.. డబ్బులు వస్తున్నాయి. కానీ, జాబ్ విషయం లో సంతృప్తికరంగా లేదు. ఎందుకంటే, రొటీన్ అయిపోయింది. ఎమోషనల్ సీన్ లేదా ఒక సాంగ్ కు  డ్యాన్స్ వేస్తానంటే.. అవకాశమివ్వరు. ఎందుకంటే, నాపై కమెడియన్ ముద్ర పడింది కాబట్టి. కానీ, అన్ని రోల్స్ తాను పోషించగలనని నాకు నమ్మకం ఉంది. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’లో ఎమోషనల్, కామెడీ, డ్యాన్స్.. అన్ని బాగా పండించాను’ అని సప్తగిరి చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News