: బైబిల్ చదివి వినిపించిన చంద్రబాబు
ఈ ఉదయం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పెదకాకానిలోని ప్రముఖ చర్చిలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, బైబిల్ లోని ఓ వాక్యాన్ని చదివి, అక్కడున్న క్రైస్తవులకు ఆనందాన్ని కలిగించారు. బైబిలులోని 23వ స్తోత్రంలోని ఓ వాక్యాన్ని ఆయన చదివారు. "కీర్తన 23వ పేజీ... యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. సంతృప్తిగా బతుకు'' అన్న కోట్ ను చదవగా, అక్కడే ఉన్న క్రైస్తవులు చప్పట్టు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏసుక్రీస్తును ప్రార్థించడం తన పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా బాబు వ్యాఖ్యానించారు.