: అధ్యక్షుడిగా చివరి క్రిస్మస్ సందేశాన్నిచ్చిన ఒబామా


అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి, ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామాాలు తమ చివరి క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. అమెరికన్లలో విలువలు ఎంతో గొప్పవని, ఆ విలువలే దేశ ప్రజలను ఐకమత్యంలో నిలుపుతాయని అభిప్రాయపడ్డారు. ప్రజలంతా సహోదర భావంతో మెలగాలని, క్రిస్మస్‌ ను ఉల్లాసంగా జరుపుకోవాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టిన నాటితో పోలిస్తే, ఇప్పుడు అమెరికా మరింత బలోపేతమైందని, ప్రపంచంలోని అన్ని దేశాలూ గౌరవిస్తున్న దేశంగా నిలిచిందని తెలిపారు. నిరుద్యోగాన్ని తొమ్మిదేళ్ల కనిష్ఠస్థాయికి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. అమెరికా సైన్యం అందిస్తున్న సేవలకు ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News