: చైనా కార్మికుల రక్షణ కోసం 4 వేల మంది సైన్యాన్ని మోహరించిన పాకిస్థాన్
చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనా కార్మికుల రక్షణ కోసం పాకిస్థాన్ 4 వేల మంది ప్రత్యేక సైన్యంతో భద్రతా ఏర్పాట్లను చేసింది. ఈ విషయాన్ని సింధ్ చీఫ్ మినిస్టర్ సయ్యద్ మురాద్ అలీ షా వెల్లడించారు. తమ ప్రభుత్వానికి చైనా కార్మికుల భద్రత అత్యంత ప్రాధాన్యమైన అంశమని, చైనా మిత్రులు పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి భద్రత కోసం సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన 2 వేల మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నామని మురాద్ అలీ పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో 100కు పైగా చైనా కంపెనీలు సీపీఈసీలో భాగంగా పని చేయనున్నాయని ఆయన తెలిపారు.