: మ‌రో ప్ర‌పంచ రికార్డుకు చేరువ‌లో సైక‌త‌శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్‌.. పూరీ తీరాన వెయ్యి శాంతాక్లాజ్‌లు


ప్ర‌పంచ ప్ర‌సిద్ధ పుణ్యక్షేత్రం పూరీ తీరాన వెయ్యి శాంతాక్లాజ్‌ల‌ను తీర్చిదిద్దిన ప్ర‌ముఖ సైక‌త శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ మ‌రో ప్ర‌పంచ రికార్డుకు చేరువ‌య్యారు. క్రీస్తు  జ‌న్మ‌దిన‌మైన క్రిస్మ‌స్‌ను పుర‌స్క‌రించుకుని 'ప్ర‌పంచానికి సంతోషాన్ని తీసుకురావాలి' అనే సందేశంతో స‌ముద్ర తీరంలో వెయ్యి శాంతాక్లాజ్‌ల‌ను జీవ‌క‌ళ ఉట్టిప‌డేలా తీర్చిదిద్దారు. 2012లో 500 శాంతాక్లాజ్‌ల‌తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు ద‌క్కించుకున్న సుద‌ర్శ‌న్ తాజాగా వెయ్యి శాంతాక్లాజ్‌ల‌తో త‌న రికార్డును తానే బ‌ద్ద‌లుకొట్టారు. సుద‌ర్శ‌న్‌తోపాటు శాండ్ ఆర్ట్ స్కూలుకు చెందిన 35 మంది విద్యార్థులు నాలుగు రోజులు శ్ర‌మించి వీటిని తీర్చిదిద్దారు. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ ప్ర‌తినిధుల సూచ‌న‌ల‌తోనే వీటిని పూర్తిచేశాన‌ని, వీటికి అందులో చోటు ద‌క్కుతుంద‌ని ప‌ట్నాయ‌క్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News