: ప్రధాని ఈ దేశాన్ని రెండుగా విడగొట్టారు..: రాహుల్


ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు  రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. ప్రభుత్వ విధానాలు దేశంలో కేవలం ఒక్క శాతం మంది ప్రజలకే ప్రయోజనం కలిగించాయన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఈ రోజు జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు. పెద్ద నోట్ల రద్దు సామాన్యులను తీవ్ర కష్టాల్లోకి నెట్టిందన్నారు. పేదల నుంచి డబ్బులను తీసుకుని ప్రభుత్వం పెద్దలకు పెడుతోందన్నారు. డీమోనిటైజేషన్ దేశ ఆర్థిక రంగంపై ఫైర్ బాంబ్ గా అభివర్ణించారు.

‘ప్రధాని ఈ దేశాన్ని రెండు భాగాలు చేశారు. ఒకవైపు మొత్తం జనాభాలో సంపన్నులైన ఒక శాతం మంది ఉండగా, మధ్య తరగతి, పేదలంతా మరోవైపు ఉన్నారు’ అని రాహుల్ పేర్కొన్నారు. ఒక్క శాతం మంది వద్దే దేశ సంపదలో 60 శాతం పోగుబడి ఉందని చెప్పారు. నల్లధనాన్ని ఏరిపారేస్తామని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడాన్ని విమర్శించారు. నల్లధనం కలిగిన వారు దాన్ని నగదు రూపంలోనే ఉంచుకోరన్న విషయాన్ని గుర్తు చేశారు. సామాన్యులు క్యూలలో కష్టాలు పడుతుంటే, విజయ్ మాల్యా, లలిత్ మోదీ వంటి వారు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. 

  • Loading...

More Telugu News