: నోట్ల రద్దు అనైతికం... ప్రజల సొత్తు దోచుకోవడమే!: ఫోర్బ్స్ మేగజీన్ సంచలన వ్యాఖ్యలు


డీమానిటైజేషన్ పై ప్రముఖ ఫోర్బ్స్ మేగజీన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అనైతికమని, ప్రజల సొత్తును దోచుకోవడమేనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజల ఆస్తులను భారీగా దోచుకోవడానికి తీసుకున్న చర్యగా డీమానిటైజేషన్ ను పోల్చిన ఫోర్బ్స్ మేగజీన్, ఈ నిర్ణయాన్ని 1975-77 మధ్య ఎమర్జన్సీ కాలంలో అప్పటి  ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టిన బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమం (ఫోర్స్ డ్-స్టెరిలైజేషన్ డ్రైవ్) తో పోల్చింది. ఈ నిర్ణయం భారతదేశ ఆర్థికవ్యవస్థ, భవిష్యత్ పెట్టుబడులను దారుణంగా దెబ్బతీసిందని ఫోర్బ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీవ్ ఫోర్బ్స్ అభిప్రాయపడ్డారు.

చలామణిలో ఉన్న కరెన్సీని అకస్మాత్తుగా రద్దు చేయడమంటే సామాన్యుడి గోప్యతపై దాడి చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాక, కోట్లాది మంది  పేదల్ని మరింత ఆందోళన, అగమ్యగోచర స్థితిలోకి నెట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్య కారణంగా టెర్రరిస్టులు తమ చర్యలు మానేయరని ఆయన స్పష్టం చేశారు. స్వేచ్ఛా మార్కెట్లు ఉంటేనే డిజిటలైజేషన్ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. తాజా నిర్ణయాలు, పన్నుల విధానాన్ని కూడా ఆయన తూర్పారబట్టారు. పన్నుల ఎగవేతకు అవకాశం లేని, పన్ను విధానం అమలు చేయాలని ఆయన సూచించారు. దేశీయ కరెన్సీని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. 

  • Loading...

More Telugu News