: పాస్ పోర్టు నిబంధనలకు సవరణ.. జనన ధ్రువీకరణకు ఆధార్ కార్డు చాలు!
పాస్ పోర్టు పొందాలనుకునే వారికి జనన ధ్రువీకరణ పత్రం (డేటా ఆఫ్ బర్త్ సర్టిఫికెట్) లేకుంటే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంటాయన్న సంగతి విదితమే. ఇకపై, అటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను, కేంద్ర విదేశాంగ శాఖ పాస్ పోర్టుకు కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఆధార్ కార్డునే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ గా స్వీకరిస్తామని తాజాగా ప్రకటించింది. ఆధార్ కార్డులో నమోదైన వివరాలనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ గా పాస్ పోర్టు అధికారులు పరిగణిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.