: అశ్విన్! బాగుంది... ఆలూ కూరలా అయిపోయావ్!: అకట్టుకుంటున్న సెహ్వాగ్ ట్వీట్


సోషల్ మీడియాలో ట్వీట్లతో అశేషమైన అభిమానులను సంపాదించుకున్న టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ట్విట్ తో అభిమానులను రంజింపజేశాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నందుకు అభినందనలు, శుభాకాంక్షలు చెప్పాడు. ఆలూ (బంగాళాదుంప) కూరలా అన్ని సందర్భాల్లోనూ అడ్జెస్ట్ అవుతున్నావు! అంటూ అభినందించాడు. ఆలూకూర పద ప్రయోగం బాగుందంటూ అభిమానుల నుంచి సెహ్వాగ్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

  • Loading...

More Telugu News