: రజనీకాంత్ నాకు ఆదర్శం...తెలుగు సినిమాలు చూశాను: హృతిక్ రోషన్
గతంలో తెలుగు, తమిళ సినిమాలు చూసేవాడినని, ప్రస్తుతం తనకు అంత సమయం లేకపోవడంతో చూడడం లేదని బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అన్నాడు. తమిళ, తెలుగు సినిమాల టెక్నికల్ వాల్యూస్ చాలా గొప్పవని అన్నాడు. సినిమాకు చాలా నిబద్ధతతో పని చేస్తారని అన్నాడు. తనకు రజనీకాంత్ అంటే చాలా ఇష్ఠమని చెప్పాడు. కాబిల్ ట్రైలర్ చూసిన రజనీకాంత్ తనకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారని అన్నాడు. దానిని భద్రపరుచుకున్నానని చెప్పాడు.
ప్రతి నటుడు రజనీకాంత్ ను చూసి చాలా నేర్చుకోవాలని అన్నాడు. తనకు రజనీకాంత్ ఆదర్శమని తెలిపాడు. ఆయనలా జీవించగలిగితే జీవితంలో చాలా సాధించినట్టని ఆయన చెప్పాడు. తెలుగు సినిమాలు కొన్నిటిని తాను చూశానని చెప్పాడు. తెలుగు, తమిళ భాషల్లో తన పాత్రకు డబ్బింగ్ చాలా బాగా చెప్పారని, కాబిల్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావడం పట్ల సంతోషంగా ఉన్నానని చెప్పాడు.