: సూపర్ ఎర్త్: భూమిలాంటి పెద్ద గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు!


భూతాపం పెరిగిపోతోంది. పరిశ్రమలు, వాహనాలు, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు విడుదల చేసే కాలుష్యం కారణంగా భూమి నివాసయోగ్యమైన గ్రహం అనే అర్హతను నెమ్మదిగా కోల్పోతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దీంతో మానవ జాతికి ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో మానవ మనుగడ కోసం శాస్త్రవేత్తలు మరో గ్రహాన్ని అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అరుణ గ్రహానికి వెళ్లే ప్రయత్నాల్లో తలమునకలైఉన్నారు. ఈ క్రమంలో చేస్తున్న పరిశోధనల్లో సౌరకుటుంబానికి ఆవల భూమిన పోలిన ఓ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది అచ్చం భూమిలా ఉన్నప్పటికీ పరిమాణం విషయంలో మాత్రం భూమి కంటే 1.5 రెట్లు పెద్దగా ఉంటుందని వారు గుర్తించారు.

దీనిని చాలా కాలం నుంచి గమనిస్తున్నట్టు నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ గ్రహంపై 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. దీనిపై నీరు ఉండే అవకాశం ఉందని, పెద్ద సముద్రమే ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారు వెల్లడించారు. అయితే ఇది భూమికి 150 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వారు పేర్కొన్నారు. ఈ గ్రహానికి 'సూపర్ ఎర్త్' అని పేరుపెట్టారు. దీనిని కెప్లర్ టెలిస్కోప్ ద్వారా గుర్తించినట్టు వారు వెల్లడించారు. ఇది సూర్యుడి కంటే చిన్నదైన ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని వారు తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు నిర్వహించిన తరువాత ఇది జీవయోగ్యమైన గ్రహమో కాదో తేలుస్తామని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News