: ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయే వారికి నష్టపరిహారం పెంచిన రైల్వే శాఖ


మన రైళ్లు తరచుగా ప్రమాదాలకు గురవుతూ... వందలాది ప్రాణాలను బలిగొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కాన్పూర్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఏకంగా 143 మంది ప్రాణాలను కోల్పోయారు. అంతేకాదు, 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో, ఇకపై రైలు ప్రమాదాల బాధిత కుటుంబాలకు నష్టపరిహారాలను రెట్టింపు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మరణించిన వారి కుటుంబానికి ఇచ్చే ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచింది. అలాగే తీవ్రంగా గాయపడి కాలు, చేయి వంటి కీలక అవయవాలను పోగొట్టుకున్నవారికి కూడా రూ. 8 లక్షలు అందజేయనున్నారు. 

  • Loading...

More Telugu News