: విమాన ప్రయాణంలో యువతి నిద్రపోతుంటే చేతులేసి, ఆపై సారీ చెప్పిన ఇండియన్... అమెరికాలో అరెస్ట్


ఇండియాకు చెందిన గణేష్ పార్కర్ (40) అనే వ్యాపారి, ముంబై నుంచి నెవార్క్ కు ఓ విమానంలో వెళుతూ, సాటి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించి, ఆపై క్షమించాలని కోరినప్పటికీ లాభం లేకపోయింది. అమెరికాలో పార్కర్ ను అరెస్ట్ చేసి, ఆపై 50 వేల డాలర్ల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన కోర్టు, ప్రస్తుతం అతన్ని హౌస్ అరెస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే, అమెరికాలో ఉంటున్న పార్కర్, ఎయిర్ ఇండియా విమానంలో నెవార్క్ కు ఓ బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు.

విమానం ఎక్కిన తరువాత ఎకానమీ క్లాసులో బాధితురాలు కూర్చున్న పక్క సీటులోకి మారాడు. ఆపై ఆమె నిద్రపోతుంటే, అసభ్య చేష్టలు చేశాడు. ఆమె కప్పుకున్న దుప్పటిని తొలగించి శరీరంపై చేతులు వేశాడు. నిద్రమేలుకున్న ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో విమాన సిబ్బంది పార్కర్ ను తిరిగి అతనికి కేటాయించిన సీటులోకి పంపారు. ఆపై బాధితురాలితో మాట్లాడతానని అతను ఎంతగా ప్రాధేయపడ్డా, విమాన సిబ్బంది అంగీకరించలేదు. చివరికి తన చర్యలు తప్పని అంగీకరిస్తూ, రెండు వాక్యాల క్షమాపణ లేఖను రాసి ఆమెకు పంపాడు. విమానం దిగిన తరువాత అతన్ని అరెస్ట్ చేశారు. యువతి నిద్రిస్తున్న వేళ, ఆమె దుస్తులను పార్కర్ తొలగించాడని నెవార్క్ ఫెడరల్ కోర్టు ముందు ప్రాసిక్యూటర్లు వాదించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.

  • Loading...

More Telugu News