: అక్రమార్జన రూ.17 కోట్లు.. అంగీకరించిన మాజీ సీఎస్ రామ్మోహనరావు తనయుడు
తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు తనయుడు వివేక్ తన వద్ద నల్లధనం ఉన్నట్టు అంగీకరించారని ఆదాయపు పన్నుశాఖ అధికారులు తెలిపారు. వివేక్ తన వద్ద రూ.17 కోట్ల అక్రమార్జన ఉందని వెల్లడించారని గురువారం అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఐదు కోట్ల రూపాయలను బుధవారం వెల్లడించారని తెలిపారు. వివేక్ ఇంటి నుంచి పది కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కాగా కోడంబాకంలోని యునైటెడ్ ఇండియా కాలనీలో ఉన్న రిటైర్డ్ అటవీశాఖాధికారి ఇంట్లోనూ గురువారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.