: ఎవరినీ గాయపరచాల్సిన అవసరం లేదు.. నన్ను అరెస్టు చేయండి సరిపోతుంది: మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ లోని ధూలాగఢ్ లో మత ఘర్షణలు, దాడులతో అట్టుడికి పోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఎవరినీ గాయపరచాల్సిన అవసరం లేదని, తనను ఒక్కరిని అరెస్టు చేస్తే సరిపోతుందంటూ ప్రధానిపై మండిపడ్డారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్న ధూలాగఢ్ కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలాఘాట్ లో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ లో మత ఘర్షణలు రేకెత్తించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ, బీజేపీకి ఎంత దమ్ముందో తాను కూడా చూస్తానని, ఎన్ని ఘర్షణలు సృష్టిస్తారో, ఎంతగా లూటీ చేస్తారో చూస్తానంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ హింసలో ఎలాంటి అర్థం లేదని, ఈ విషయాన్ని మోదీ, బీజేపీకి చెప్పదలచుకున్నానని అన్నారు.