: మీరు సెన్సేషన్ కోసం న్యూస్ చెప్పకండి... న్యూస్ ని న్యూస్ లా చెప్పండి: రాంగోపాల్ వర్మ


'వంగవీటి' సినిమా రేపు దేశవ్యాప్తంగా ధియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏబీఎన్ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన రాంగోపాల్ వర్మ... ఇంటర్వ్యూ ముగిసిన అనంతరం యాంకర్ మూర్తి ఇచ్చిన ముక్తాయింపును విని క్లాస్ పీకాడు. మీరు సెన్సేషన్ కోసం న్యూస్ చూపించొద్దని హితవు పలికాడు. వివాదం చేయడం మీ బాధ్యత కాదని.... వార్తలను బాధ్యతాయుతంగా చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని గుర్తించాలని సూచించాడు. 'న్యూస్ ని న్యూస్ లా చెప్పండి' అని చెప్పాడు. దీంతో 'నేను అడిగిన ప్రశ్నలకు నాపై కసితీర్చుకుంటున్నారా?' అని యాంకర్ ప్రశ్నించగా, 'అవును, ఇది నా కసి' అని సూటిగా సమాధానమిచ్చి మరింత ఆశ్చర్యపరిచాడు. 

  • Loading...

More Telugu News