: నేను చాలా ఎమోషనల్... కానీ, లేనట్లు నటిస్తాను: రాంగోపాల్ వర్మ
తాను చాలా ఎమోషన ల్ పర్సన్ ని అనీ, అయితే ఎమోషన్ లేనట్లుగా నటిస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ‘వంగవీటి’ చిత్రం రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘నేను ఎప్పుడు ఏం చేస్తాను, ఏం చెయ్యను? అనేది కచ్చితంగా ఉండదు. నాతో ఇరవై సంవత్సరాల పరిచయం ఉన్న వాళ్లు కూడా నా మాటలకు కన్ ఫ్యూజ్ అవుతారు’ అని చెప్పారు. ‘వంగవీటి’ చిత్రం గురించి మాట్లాడుతూ, ఒక న్యూట్రల్ పర్సన్ గా ఈ సినిమాను తెరకెక్కించానని, ఎక్కడా కూడా ఒక వర్గాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ కించపరచడానికి తాను ప్రయత్నించలేదని చెప్పారు.