: వైస్ ఛాన్సెలర్లు వచ్చి శశికళను కలుస్తారా? ఇంత ఘోరమా?: గవర్నర్ కు లేఖ రాసిన స్టాలిన్


తమిళనాడులోని రాజకీయాలు జయలలిత మరణం తర్వాత గందరగోళంగా మారాయి. పార్టీలో జయలలిత స్థానంలోకి వచ్చి, ముఖ్యమంత్రి పదవిని సైతం చేపట్టాలని ఆమె నెచ్చెలి శశికళ ప్రయత్నిస్తున్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, అన్నాడీఎంకే శ్రేణులు చిన్నమ్మకు పాదాభివందనాలు చేయడం ప్రారంభించేశారు. ఈ క్రమంలో తాజాగా 10 యూనివర్శిటీల వైస్ ఛాన్సెలర్లు వచ్చి శశికళను కలిశారు. దీనిపై గవర్నర్ విద్యాసాగరరావుకు డీఎంకే నేత స్టాలిన్ లేఖ రాశారు. ఎటువంటి రాజ్యాంగ పదవిలోనూ లేని శశికళను వీసీలు ఎలా కలుస్తారని లేఖలో ప్రశ్నించారు. జయలలిత స్థానంలోకి రావాలని శశికళను ఎలా కోరతారని అన్నారు. ఇదంతా విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించడమే అని చెప్పారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని విద్యావ్యవస్థను కాపాడాలని విన్నవించారు. 

  • Loading...

More Telugu News