: భర్త ఇంటి ముందు 'మౌనపోరాటం' చేస్తున్న యువతి!
ఒక యువతి జీవితంలో చోటు చేసుకున్న మలుపులు ఆమెను నడిరోడ్డుమీద నిలబెట్టాయి. వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన షహీనా, సోమశేఖర్ లు ఏడాదిపాటు ప్రేమించుకున్నారు. ఎన్నో ప్రమాణాలు చేసుకున్నారు. అయితే షహీనాకు తల్లి మరో సంబంధం కుదిర్చింది. దీంతో ప్రియుడు సోమశేఖర్ ను వివాహం చేసుకోవాలని షహీనా కోరింది. దీంతో మతాన్ని వంకగా చూపించి వివాహానికి నిరాకరించాడు. దీంతో షహీనా వివాహం తల్లి చూసిన వ్యక్తితో జరిగిపోయింది. మూడు రోజుల తరువాత సంప్రదాయం ప్రకారం పుట్టింటికి వచ్చిన షహీనాను సోమశేఖర్ మళ్లీ కలిశాడు. ఆమె లేకపోతే బతకలేనన్నాడు. 'ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కలిసి బతుకుదామన్నాడు. నువ్వు లేకుండా పిచ్చెక్కిపోతుందని' చెప్పాడు. దీంతో ప్రియుడి మాటలకు షహీనా కరిగిపోయింది. తనను ఇంతకు మునుపు నిరాకరించాడన్న విషయాన్ని మరచిపోయింది. సరే అంది.
వివాహం, కుటుంబం పరువు కంటే తాను ఆనందంగా ఉండడమే ముఖ్యమని భావించింది. దీంతో అతడితో కలిసి వెళ్లిపోయింది. ఆమెను తీసుకుని వెళ్లిపోయిన సోమశేఖర్ విజయవాడలో కాపురం పెట్టాడు. అప్పటి నుంచి షహీన్ కు కుటుంబంతో బంధాలు తెగిపోయాయి. సోమశేఖర్ మాత్రం తన వారితో ఎప్పట్లానే ఉన్నాడు. దీంతో సోమశేఖర్ తల్లిదండ్రులు వారిని ఇంటికి వచ్చేయమన్నారు. దానికి షహీనా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నప్పటికీ, సోమశేఖర్ మాత్రం తిరుపతి వెళ్దామనడంతో తప్పక తిరుపతికి వచ్చారు. తిరుమలకు చేరగానే షహీనాను వదిలేసి సోమశేఖర్ ను అతని తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక తల్లి దగ్గరకు వెళ్లిన షహీన్ కు తిరస్కారం ఎదురైంది. పెళ్లైన మూడు రోజులకే వెళ్లిపోయి, 40 రోజుల తరువాత వస్తే జరిగిన అవమానం మర్చిపోలేనని ఆమె తల్లి ఆమెను తిప్పిపంపేసింది. దీంతో ఇక దిక్కులేక ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటం చేస్తోంది షహీన్.