: అవన్నీ పుకార్లు మాత్రమే: హర్భజన్ సింగ్


త్వరలోనే పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడనే కథనాలు వెల్లువెత్తాయి. అయితే, ఈ వార్తలను హర్భజన్ తోసిపుచ్చాడు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు. ఇలాంటి వదంతులను వ్యాప్తి చేయడాన్ని మానుకోవాలని విన్నవించాడు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు బీజేపీని వదిలి కాంగ్రెస్ లో చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సిద్దు బాటలోనే హర్భజన్ కూడా కాంగ్రెస్ లో చేరుతాడని కథనాలు వచ్చాయి. 

  • Loading...

More Telugu News