: కోహ్లీ సేనకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వద్దు: బీసీసీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు


సీనియర్ క్రికెట్ కానీ, అండర్ 19 క్రికెట్లో కానీ, ద్వైపాక్షిక సిరీస్ లలో మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తే ఆటగాళ్లకు ప్రోత్సాహక బహుమతులను ఇవ్వడం బీసీసీఐకి ఆనవాయతీగా వస్తోంది. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కోహ్లీ సేన సత్తా చాటి, సిరీస్ ను 4-0తో కైవసం చేసుకుంది. దీంతో, ఇప్పుడు కూడా టెస్టు జట్టులో ఉన్న ఆటగాళ్లకు పర్ఫామెన్స్ ఇన్సెంటివ్ లు ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఈ క్రమంలో, బీసీసీఐకి సుప్రీంకోర్టు షరతు విధించింది. ఆటగాళ్లకు ఎలాంటి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వరాదంటూ ఆదేశించింది. లోథా కమిటీ సిఫారసులను బీసీసీఐ ఇంకా పాటించకపోవడంతో... డబ్బు లావాదేవీల కోసం అపెక్స్ కోర్ట్ పర్మిషన్ ను తప్పనిసరిగా బీసీసీఐ తీసుకోవాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News