: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఐదు సీట్లే.. కేసీఆర్ గెలవడం కూడా కష్టమే.. జోస్యం చెప్పిన కోమటిరెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌కు  కేవలం ఐదు సీట్లు మాత్రమే వస్తాయని, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, మరో ముగ్గురు మాత్రమే గెలుస్తారని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గెలుపు కూడా కష్టమేనని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తన నాలుక మీద మచ్చ ఉందని, తాను అన్నది నిజమవుతుందని పేర్కొన్నారు. 2011లో తనతోపాటు మిగిలిన మంత్రులు కూడా రాజీనామా చేసి ఉంటే తెలంగాణ అప్పుడే వచ్చి ఉండేదని అన్నారు. కాంగ్రెస్‌కు వంద సీట్లు వచ్చేవని, దీంతో టీఆర్ఎస్ అడ్రస్ గల్లంతై ఉండేదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తాను తెలంగాణ వ్యాప్తంగా బైక్ యాత్ర చేస్తానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News