: పక్క పార్టీ నుంచి వచ్చి ఈ మాటలేంటి?: జేసీ దివాకర్ రెడ్డిపై మండిపడ్డ బొండా ఉమ


కేవలం  చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రాలేదని... అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలోనే తాను టీడీపీలో చేరానని... చంద్రబాబు పిలిస్తే రావడానికి ఆయనేమన్నా గాంధీనా? అంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై అమెరికా పర్యటనలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

పక్క పార్టీ నుంచి వచ్చి ఈ మాటలేంటని జేసీపై మండిపడ్డారు. ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకోవాలని అన్నారు. పార్టీకి సంబంధించి కాని, అధినేతపై కానీ కామెంట్ చేసే ముందు బాగా ఆలోచించుకోవాలని... ఆ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారకూడదని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారని... అందుకే టీడీపీకి ఓటు వేశారని బొండా ఉమ అన్నారు. 

  • Loading...

More Telugu News