: నేడు వైఎస్ జగన్ పుట్టినరోజు.. శుభాకాంక్షల వెల్లువ
నేడు వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైకాపా లోక్ సభపక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, మహ్మద్ ముస్తఫా, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఒక రోజు ముందే జగన్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. నేడు హైదరాబాద్ లోని పార్టీ సెంట్రల్ ఆఫీసులో రక్తదాన శిబిరం నిర్వహించనున్నామని, జిల్లాల్లో వైకాపా కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. పలు జిల్లాల పార్టీ కమిటీలు జగన్ పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నాయి.