: మన్మోహన్‌సింగ్ రెండుసార్లు ప్రధాని అయినా నాయకుడు మాత్రం కాలేకపోయారు... చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు


రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్‌సింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ ఈ దేశానికి ఏకధాటిగా రెండుసార్లు ప్రధానిగా పనిచేశారని, కానీ ఆయన నాయకుడు కాలేకపోయారని అన్నారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ వర్క్‌షాప్‌లో చంద్రబాబు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సూటుబూటు వేసుకుని గ్రామాల్లోకి వెళ్తే జనం దగ్గరకు రారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చాలా వ్యవస్థల్ని సృష్టించాయని, కానీ పనిచేయించడం మానేశాయని అన్నారు. ఇప్పుడు మనం వాటిని పనిచేయిస్తున్నామన్నారు. లక్ష్యం లేకుంటే పోకస్ రాదని, ఏదైనా సాధించాలంటే నిపుణత, నిబద్ధత చాలా అవసరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు కావాలనుకుంటారని, ఇతరులు ఎమ్మెల్యేలు కావాలనుకుంటారని అది సహజమని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న తాను కూడా ఎల్లకాలం ఇదే పదవిలో ఉండాలనుకుంటానని, ఇందులో తప్పేమీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News