: త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ.. అన్నాడీఎంకే ఎంపీ నవనీత కృష్ణన్ సంచలన వ్యాఖ్యలు


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్న ఆమె నెచ్చెలి శశికళ తర్వలో ముఖ్యమంత్రి పదవిని కూడా అధిష్టించనున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నవనీత కృష్ణన్. శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కొందరు మంత్రులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

తమిళ వెబ్‌పోర్టల్ ఒకటి నవనీత కృష్ణన్‌తో నిర్వహించిన ముఖాముఖిలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. శశికళ కోసం ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సీఎం పదవిని వదులుకుంటారా? అన్న వెబ్‌ పోర్టల్ ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘చిన్నమ్మ తలచుకుంటే ఈ నెల 5నే ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆమెను ఎవరూ ప్రశ్నించలేరు. త్వరలో చిన్నమ్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు’’ అని నవనీతకృష్ణన్‌ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News