: పాతనోట్లతో బంగారం మార్పిడికి యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లతో బంగారం కొనేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను మంగళవారం పెద్దపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.28 లక్షల విలువైన కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ పేర్కొన్నారు.