: దొంగతనానికి పాల్పడ్డ విదేశీయులతో ‘షేమ్ వాక్’ చేయించిన గ్రామపెద్ద!


ఇండోనేషియా దేశంలో తప్పు చేసిన వారిని ‘షేమ్ వాక్’ పేరిట వీధుల్లో ఊరేగించే ఆచారం  చాలా కాలంగా అక్కడ అమలులో ఉంది. స్థానికులు ఎవరు తప్పు చేసినా ఈ శిక్ష తప్పదు. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు పర్యాటకులు ఈ దేశంలో దొంగతనానికి పాల్పడుతూ దొరికిపోయారు. ఈ ఏడాది ‘షేమ్ వాక్’ కు గురైన విదేశీయులు వీరే. ఈ సంఘటన ఇండోనేషియాలోని బాలి సమీపంలో గల గిలి త్రావంగన్ అనే ద్వీపంలో జరిగింది.

ద్వీప గ్రామపెద్ద తౌఫిక్ చెప్పిన వివరాల ప్రకారం... ఆస్ట్రేలియాకు చెందిన పర్యాటక జంట సుమారు పదిరోజుల క్రితం గిలి త్రావంగన్ లోని ఒక హోటల్ వద్ద సైకిల్ దొంగిలించారు. ఈ విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్న సదరు హోటల్ యజమాని ఆ ద్వీప పెద్దలకు ఫిర్యాదు చేశాడు. ఆ విదేశీ జంటను అదుపులోకి తీసుకున్న గ్రామపెద్దలు ఈ విషయమై వారిని ప్రశ్నించగా, దొంగతనం చేశామని వారు ఒప్పుకున్నారు. దీంతో, ‘నేను దొంగను. ఇలాంటి పని మరెవవరూ చేయొద్దు’ అని ఇంగ్లీషులో రాసి ఉన్న బోర్డులను వారి మెడలో వేసి ఆ గ్రామంలో ఊరేగించామని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని ఆదేశించామని తౌఫిక్ చెప్పారు. 

  • Loading...

More Telugu News