: ఇక మిగిలింది బ్రాడ్, బాల్...విజయం అంచున టీమిండియా
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో టీమిండియా విజయానికి కేవలం రెండు వికెట్ల దూరంలో ఉంది. భారత బౌలర్ల అసాధారణ పోరాటానికి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ తలవంచారు. ఇంగ్లండ్ బౌలర్లు చేష్టలుడిగిన చోట టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించి, వికెట్లు తీస్తూ ఆకట్టుకున్నారు. పిచ్ టర్న్ కు సహకరిస్తుండడంతో రవీంద్ర జడేజా చెలరేగి ఐదు వికెట్లు తీయగా, అతనికి మరో స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక వికెట్ తీసి సహకరించాడు.
ఈ విజయంలో తమ భాగం కూడా వుండాలి అనేందుకా అన్నట్టు పేసర్లు ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ కూడా చెరొక వికెట్ తీసి, ఇంగ్లండ్ పతనంలో చేయివేశారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 200 పరుగుల వద్ద 8వ వికెట్ ను కోల్పోయింది. ఇంకా పది ఓవర్లు మిగిలి ఉండగా, భారత్ స్కోరును అందుకునేందుకు ఇంగ్లండ్ 81 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, బాల్ ల వికెట్లు తీస్తే ఇండియా తిరుగులేని విజయం సాధిస్తుంది. విజయం కోసం టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.