: మోదీ నిర్ణయంపై నెల రోజుల తర్వాత స్పందించిన సోనియా అల్లుడు


పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా స్పందించారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు తీసుకున్న ఓ తొందరపాటు నిర్ణయమని ఆయన ఎద్దేవా చేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించిన నెల తర్వాత రాబర్ట్ వాద్రా స్పందించడం గమనార్హం.

దేశ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ప్రయోగాలు చేస్తోందని... ఈ ప్రయోగాలు ఇంకెంత కాలం కొనసాగుతాయని ఆయన తన ఫేస్ బుక్ పేజ్ లో ప్రశ్నించారు. రూ. 5వేలకు మించి ఇకపై ఒకసారే బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని... డిపాజిట్ చేసే సమయంలో ఇప్పటిదాకా ఈ మొత్తాన్ని ఎందుకు డిపాజిట్ చేయలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆర్బీఐ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కూడా వాద్రా తప్పుబట్టారు. ప్రతి రోజూ రూల్స్ మార్చివేస్తున్నారని... దీంతో, ప్రజల సమస్యలు మరింత ఎక్కువయ్యాయని విమర్శించారు. 

  • Loading...

More Telugu News