: క్రిస్మస్ మార్కెట్లో ట్రక్కు బీభత్సం.. 9 మంది దుర్మరణం.. ఉగ్రవాదుల పనేనని అనుమానం
బెర్లిన్‌లోని రద్దీ క్రిస్మస్ మార్కెట్లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. కొనుగోళ్లతో బిజీగా ఉన్న ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనను జర్మన్ మీడియా నిర్ధారించింది. కైసెర్ విల్హెమ్ మెమోరియల్ చర్చ్ వద్ద జరిగిన ఈ ఘటనలో 9 మంది మృతి చెందారని, 50 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.