: షరియా కోర్టులన్నీ నెల రోజుల్లోగా తమ కార్యకలాపాలు నిలిపేయాలి!: మద్రాసు హైకోర్టు ఆదేశం
తమిళనాడులో అనధికారికంగా నిర్వహిస్తున్న షరియా కోర్టులపై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. షరియా కోర్టులు ఇచ్చే అనధికార తీర్పులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్రిటన్ లో ఉంటున్న అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం... రాజ్యాంగేతర కార్యకలాపాలు సాగించే వేదికల్లో తీర్పులు ఆపేయాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఆలయం, మసీద్, చర్చ్ .. ఇలా భగవంతుడిని కొలిచే చోటు ఏదైనాసరే ప్రార్థనల కోసం కాకుండా, రాజ్యాంగేతర కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకొంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కృష్ణన్ కౌల్, జస్టిస్ ఎం సుందర్ లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.