: టిట్ ఫర్ టాట్: మాఫియా డాన్ తల్లిని కిడ్నాప్ చేసిన గ్రామస్థులు!


కిడ్నాప్ కు కిడ్నాప్ తోనే సమాధానం చెప్పారు ఆ గ్రామస్థులు. వివరాల్లోకి వెళ్తే... మెక్సికో నేరమయ డ్రగ్ సామ్రాజ్యం గురించి అందరికీ తెలిసిందే. టోటోలపాన్ అనే గ్రామంలో ఎల్ టెకిలెరో అనే డాన్ ఉన్నాడు. అతనికి కిడ్నాపులు చేయడం గన్నుతో పెట్టిన విద్య. గ్రామంలోని యువతను కిడ్నాప్ చేయడం, డ్రగ్ స్మగ్లింగ్ కోసం వినియోగించుకోవడం అతనికి అలవాటు. ఎవరైనా ఎదురు తిరిగినా, తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారన్న అనుమానం వచ్చినా వారిని లేపేసేవాడు. దీంతో అతనంటే ద్వేషం ఉన్నప్పటికీ, భయంతో మౌనంగా ఉండిపోయేవారు. దీనిని అవకాశంగా తీసుకున్న ఎల్ టెకిలెరో ఆ గ్రామానికి చెందిన ఓ ఇంజనీర్ ను కిడ్నాప్ చేశాడు.

దీంతో గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందరూ పకడ్బందీగా ప్లాన్ వేసి, ఆ డాన్ గారి అతని తల్లి, కొంత మంది అనుచరులను కిడ్నాప్ చేసి, నిర్బంధించారు. దీంతో ఎల్ టెకిలెరో షాక్ తిన్నాడు. ఏం కావాలని వారిని ప్రశ్నించాడు. ఇంజనీర్ ను వదిలేస్తే అతని తల్లిని వదిలేస్తామని బేరంపెట్టారు. దీంతో ఎల్ టెకిలెరో అతనిని వదిలేయగా, గ్రామస్థులు అతని తల్లిని వదిలేశారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియడంతో 220 మంది పోలీసు, మిలటరీ సిబ్బందిని గ్రామానికి పంపింది. అయితే అప్పటికే గొడవ సద్దుమణిగిపోవడం విశేషం. 

  • Loading...

More Telugu News