: పాకిస్థాన్ ఎయిర్ పోర్టులో నల్లమేకను బలిచ్చిన విమానాశ్రయ సిబ్బంది...సోషల్ మీడియాలో విమర్శలు


నల్లమేకను బలి ఇచ్చి విమానాన్ని టేకాఫ్ చేసిన ఘటన పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... డిసెంబర్ 7న పాక్ లోని హవేలియన్ సమీపంలో 47 మంది ప్రయాణికులతో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏటీఆర్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని వారంతా మరణించారు. దీంతో సర్వీసులను నిలిపేసిన వైమానిక సంస్థ, సర్వీసులన్నిటికీ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి, మరమ్మతులు పూర్తి చేసింది.

అనంతరం ఇస్లామాబాద్ విమానాశ్రయ సిబ్బంది రన్ వే పై నల్లమేకను బలి ఇచ్చారు. అనంతరం ఏటీఆర్ విమానం ఇస్లామాబాద్ నుంచి ముల్తాన్ బయల్దేరింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయంతో అధికారులకు సంబంధం లేదని, తామే మేకను బలివ్వాలని నిర్ణయించుకున్నామని, నిర్ణయించుకున్న ప్రకారం చేశామని సదరు విమానయాన సంస్థ సిబ్బంది వివరణ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News