: కోహ్లీ నిర్ణయంతో సెహ్వాగ్ రికార్డును అందుకోలేకపోయిన నాయర్


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో, కరుణ్ నాయర్ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయాడు. 2008లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 319 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా జట్టుపై కేవలం 302 బంతుల్లో సెహ్వాగ్ ఈ పరుగులు సాధించడం విశేషం. తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టులో కరుణ్ నాయర్ 381 బంతుల్లో 303 పరుగులు సాధించడం విశేషం.

తొలి సెంచరీని ఫోర్ తో చేరుకున్న కరుణ్ నాయర్, డబుల్ సెంచరీని కూడా ఫోర్ తో సాధించాడు. ట్రిపుల్ టన్ కూడా బౌండరీతో సాధించి సగర్వంగా బ్యాటు ఎత్తాడు. కెరీర్ లో తొలి సెంచరీ సాధించిన టెస్టులోనే కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించడం కూడా ఇక్కడ పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత కోహ్లీ డిక్లేర్ చేయడంతో ఇక సెహ్వాగ్ రికార్డును చేరుకునే అవకాశాన్ని నాయర్ కోల్పోయాడు.  

  • Loading...

More Telugu News