: ‘మెగాస్టార్’ సినిమా కోసం నేనూ ఎదురుచూస్తున్నాను: లారెన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్న అనంతరం లారెన్స్ మాట్లాడుతూ, తన కొత్త చిత్రం ‘శివలింగ’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా స్వామి వారి దర్శనానికి వచ్చానన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ సినిమా గురించి మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ఈ చిత్రంలో ఓపెనింగ్ సాంగ్ ని తానే చేశానని, ‘మెగాస్టార్’ అభిమానుల్లాగానే తాను కూడా ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.