: ఏడాదిపాటు నడవలేకపోయాను: నటుడు అరవింద్ స్వామి


తమిళ చిత్రం ‘తని ఒరువన్’ను తెలుగులో  ‘ధృవ’ పేరుతో రీమేక్ చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు వెర్షన్లలోనూ విలన్ పాత్రను పోషించిన అందగాడు అరవింద్ స్వామికి మంచి పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సుమారు పదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో తన వెన్నెముకకి గాయం అయిన విషయాన్ని ప్రస్తావించారు.

ఆ గాయం కారణంగా తనకు పక్షవాతం వచ్చిందని, ఏడాది పాటు నడవలేకపోయానని చెప్పారు. మళ్లీ తాను కోలుకోవడానికి నాలుగేళ్ల సమయం పట్టిందని, ఆ సమయంలో మానసికంగా దృఢంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. వ్యతిరేకమైన ఆలోచనలను దరి చేరనీయకుండా ఏదో ఒక పనితో బిజీగా ఉండాలని నాడు అనుకున్నానని, అందువల్లే, నటుడిగా మళ్లీ బిజీ అయ్యానని చెప్పారు.
 

  • Loading...

More Telugu News