: అప్పట్లో వారికి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసేవాడిని... ఇప్పుడు మనసు రావడం లేదు: రానా


టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో తనదైన శైలితో నటిస్తూ, మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు రానా. మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ లు రానాకు మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. తాజాగా రానా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. చెర్రీ, బన్నీలు ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడే... తాను కూడా పెళ్లి చేసుకుందామని అనుకున్నానని చెప్పాడు. అయితే తన మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదని తెలిపాడు. అప్పట్లో ఎప్పుడు పడితే అప్పుడు చెర్రీ, బన్నీలకు ఫోన్ లు చేసేవాడినని... వారికి పెళ్లయిన తర్వాత ఫోన్ చేయలేకపోతున్నానని చెప్పాడు. వైఫ్ తో ఎక్కడికైనా వెళ్లారేమో, ఫ్యామిలీతో బిజీగా ఉన్నారేమో అనే ఆలోచన వస్తుందని... డిస్టర్బ్ చేయడం ఎందుకు అనిపిస్తుందని తెలిపాడు. పెళ్లైన వారితో ఫ్రెండ్ షిప్ చేయడం కుదరడం లేదని... అందుకే తనకన్నా చిన్నవారితో ఫ్రెండ్ ఫిష్ చేస్తున్నానని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.


  • Loading...

More Telugu News