: తెల్లారగానే సింహాల పలకరింపు... హడలిపోయిన గ్రామస్థులు
ఈ రోజు పొద్దున్నే నిద్రలేచిన ఆ ఊరి వాళ్లకు సింహాలు గుడ్ మార్నింగ్ చెప్పాయి. వీధుల్లో దర్జాగా సేదదీరుతున్న మృగరాజులను చూసిన ప్రజలకు తీవ్ర భయాందోళన కలిగింది. ఈ ఘటన గుజరాత్ లోని సౌరాష్ట్ర జిల్లా ఆమ్రేలీ సమీపంలోని విర్ పుర్ గ్రామంలో జరిగింది. గ్రామ రహదారులపై పడుకొని వున్న సింహాలను చూసిన గ్రామస్థులు, అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారు వాహనాల్లో వచ్చి, వాటిని సమీపంలోని గిర్ అడవులకు తరిమేశారు. ఈ దృశ్యాలన్నింటినీ కొందరు ఔత్సాహికులు తమ స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరించడంతో, ఉదయం నుంచి దాదాపు అన్ని న్యూస్ చానళ్లు విర్ పుర్ గ్రామంలో హల్ చల్ చేసిన మృగరాజుల వార్తను ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.