: మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటా: నటుడు రాజ్ తరుణ్
ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని.. మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని ప్రముఖ నటుడు రాజ్ తరుణ్ అన్నాడు. హైదరాబాద్ లో జరుగుతున్న ‘శతమానం భవతి’ చిత్రం ఆడియో వేడుకలో రాజ్ తరుణ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని 'శతమానం భవతి...’ అనే పాటను లాంచ్ చేయడానికి స్టేజ్ పైకి వచ్చిన రాజ్ తరుణ్ ను వ్యాఖ్యాత సుమ ‘ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు?’ అని ప్రశ్నించగా పైవిధంగా సమాధానం చెప్పాడు.
అనంతరం, రాజ్ తరుణ్ మాట్లాడుతూ, మిక్కీ జే మేయర్ సంగీతం అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆయన సంగీతం సమకూర్చిన పాటలను పదేపదే వింటూ ఉంటానని చెప్పాడు.