: జూనియర్ హాకీ ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత్
జూనియర్ హాకీ ప్రపంచ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. లక్నోలో ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బెల్జియంపై తలపడ్డ భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. కాగా, జూనియర్ హాకీ ప్రపంచకప్ ను భారత్ సాధించడం ఇది రెండో సారి. తొలిసారి 2001లో హాకీ ప్రపంచకప్ ను భారత అండర్-21 జట్టు కైవసం చేసుకుంది. ఇన్నేళ్ల నిరీక్షణ అనంతరం ఈ విజయాన్ని భారత హాకీ జట్టు సొంతం చేసుకోవడంపై హాకీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.