: సికింద్రాబాద్ ‘బ్రాండ్ ఫ్యాక్టరీ’ దగ్గర కస్టమర్ల తోపులాట..కూలిన కటౌట్
భారీ డిస్కౌంట్ తో రెడీమేడ్ వస్త్రాలు కొనుగోలు చేయండి అంటూ ప్రముఖసంస్థ ‘బ్రాండ్ ఫ్యాక్టరీ’ ప్రకటన చేయడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ లోని సంస్థ అవుట్ లెట్స్ వద్ద కొనుగోలు దార్లు బారులు తీరారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ‘బ్రాండ్ ఫ్యాక్టరీ’కి కొనుగోలు దారులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో అక్కడి పరిస్థితి అదుపుతప్పింది. కొనుగోలుదారుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన కటౌట్ ఒకటి కూలిపోయింది. దీంతో, ‘నో స్టాక్’ అనే బోర్డును యాజమాన్యం పెట్టాల్సి వచ్చింది. కాగా, ‘బ్రాండ్ ఫ్యాక్టరీ’కి సంబంధించి అవుట్ లెట్ల వద్ద నిన్న కూడా ఇదే పరిస్థితి నెలకొంది. న్యూ ఇయర్, క్రిస్మస్, సంక్రాంతి పండగల నేపథ్యంలో సదరు సంస్థ భారీ డిస్కౌంట్ ప్రకటన చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కొంతమంది వినియోగదారులు అభిప్రాయపడ్డారు.